Sunday 30 September 2012

ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్

ఆదివారం కదా...అలా బద్దకంగా పడుకుండి పోయాను... ఫస్ట్ వార్నింగ్... ఇంకా వళ్ళు విరుస్తూ ఉంటే టీ కప్  తో హోం మినిస్టర్ రెడీ గా ఉంది. కష్టంగా లేచి టీ తాగేసి, న్యూస్ పేపర్ తిరగేస్తుండగా సెకండ్ వార్నింగ్ ... కిచెన్ లోంచి హోం మినిస్టర్ కేక... టిఫిన్ రెడీ... బ్రష్ చేయు అని.
బ్రష్ చేసి, పెసరట్టు తింటూ...  ఇంకో గంట పడుకోనిద్దూ అనుకుంటుండగా నా ఆల్ టైం ఫేవరేట్ సాంగ్  "మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగే కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది" టీవీ లో వస్తుంది...అలా టీవీ ముందు తిష్ట వేసాను. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా జెమిని టీవీ  లో భూమిక ఎపిసోడ్ అయ్యే వరకు చూసాను. మంచి మూవీ. ఆ మూవీని హాల్లొ  ఎలా చూసానో రాయాలనిపించి లాప్ టాప్ ఓపెన్ చేశాను.

అవి దోమలగూడ లో నిరుద్యోగులుగా ఉండే రోజులు. 
గోవింద్, హరికృష్ణ, రాణా, హరి &  నేను ఒక రూం  లో ఉండే వాళ్ళం.
మా రూం కాబినెట్ చాలా సరదాగా ఉండేది. ప్రతి నెలా అసెంబ్లీ లాగా మీటింగ్స్ పెట్టేవాళ్ళం.
రూం లో హరికృష్ణ (HK) CM అన్నట్టు(adminstration అంతా తనదే, cooking కూడా తనే, వంట బాగా చేస్తాడు). 
హరి ఫైనాన్సు మినిస్టర్(accounts చూసేవాడు). 
నేను హోం మినిస్టర్ (గిన్నెలు తోమడం, ఇల్లు cleaning, drinking water పట్టడం)
సివిల్ supplies (సరుకులు షాపింగ్)ఈ శాఖ  నాకు + హరికి జాయింట్ గా ఉండేది. అమీర్ పేట లో క్లాసు అయ్యాక వీక్లీ ఒక సారి ఎర్రగడ్డ రైతు బజార్ కి వెళ్లి కూరగాయలు తేవడం, మెయిన్ పని అన్నట్టు.
గోవింద్ Foreign affairs (రూం లో తక్కువ, బయట ఎక్కువ ఉండే వాడు, అంటే వాడి క్లాసు మేట్స్ రూం కి వెళ్తుండేవాడు. రూం లో ఉంటే అన్ని departments లో హెల్ప్ చేసేవాడు.) 
రాణా అనే వాడికి కాబినెట్ పోస్ట్ ఇవ్వలేదు. ఒరిస్సా వాడు కదా అని పక్కనే పెట్టేసాడు మా CM. పేరుకి సహాయ మంత్రి గా పెట్టేసి, అన్ని శాఖలలో వాడేసుకునే వాళ్ళం.

తర్వాత రోజుల్లో HK నియంతృత్వ నిర్ణయాలకు అవిశ్వాసం పెట్టిన హరి  CM అయ్యాడు లెండి . 
HK గురించి చాలా  క్లోజ్ అన్నట్టు ఉంటుంది, కానీ అతనిలో నాకు అర్ధం కాని విషయాలు చాలా ఉండేవి.

నాకు హరికి JAVA తప్ప వేరే లోకం లేదు అన్నట్టు ప్రేపర్  అవుతున్నాం. సాయంత్రం 7:30 కి HK హడావిడిగా వచ్చాడు. బాబాయ్ మనం అంతా సినిమా కి వెళ్తున్నాం అన్నాడు. అసలే నెల చివరి రోజులు. పరమ పిసినారి CM ఏంటీ... సినిమా అంటున్నాడు ఏంటి? (CM ప్లాన్ చేసాడు కాబట్టి ఫండ్స్ budget లోంచే వస్తాయి అన్నమాట. సినిమా కి వస్తారా? అంటే ఎవరి పాకెట్ నుంచి వాళ్ళే అన్నట్టు)అని ఆలోచిస్తుండగా.. చక చక వంట చేసి సాంబారు లాంటి పప్పు, నీళ్ళ లాంటి మజ్జిగ తో డిన్నర్ రెడీ అన్నాడు. taste మాత్రం సూపర్ ఉండేది.

HK లోని ఈ విపరీతాన్ని అర్ధం చేస్కోలేక భోజనం చేసి, అలా RTC క్రాస్ రోడ్స్ కి వచ్చాం. HK కష్టపడి  Q లో నిలబడి టికెట్స్ తెచ్చాడు. ఇదేంటి నేల టికెట్ అంటే... ఈ సినిమాని నేల టికెట్లోంచి చూడటమే కరెక్ట్ బాబాయ్ అని తన బడ్జెట్ పద్భనాభం logics చెప్పాడు.ఇదే బడ్జెట్ పద్భనాభం కొన్నాళ్ళ తర్వాత అర్జున్ సినిమా ని చూస్తే multiplex లోనే చూడాలి అని నాకు 100/- అప్పు గా ఇచ్చాడు. ముందే చెప్పానుగా,  HK ని అర్ధం చేస్కోవడం అంత వీజీ కాదు అని.
అలా జీరో expectations తో హాల్లో కి వెళ్ళాం. సినిమా ఎలా ఉంది  అని నేను ఇప్పుడు చెప్పడం దొంగలు పడ్డ 9 ఏళ్ళకు కుక్కలు అరిచినట్టుందిగా... అందుకే ఆ టాపిక్ వదిలేస్తున్నాను.

నేను నేల టికెట్ లో చూసిన ఏకైక సినిమా, మంచి సినిమా, నన్ను ఏడిపించిన సినిమా. జాబు సెర్చ్ లో ఉన్నాం కదా... భూమిక ఎపిసోడ్ తో చాలా connect అయ్యాను. మౌనంగానే పాట డైలీ రూం లో ప్లే అవుతుండేది.
ఇప్పటికీ ఆ పాట విన్నప్పడు చాలా motivation గా ఉంటుంది. అత్యద్బుతంగా రాసిన చంద్రబోస్ గారికి, అదే స్థాయిలో పాడిన చిత్ర గారికి HATS OFF!!!
జాబు సెర్చ్ లో ఉండి కాస్త నిరాశలో ఉన్నవాళ్లు తప్పకుండా వినవలసిన పాట అని నా ఫీలింగ్.

Thanks
రాధాకృష్ణ