Sunday 15 September 2013

నిర్భయ తీర్పు

13/9/2013 ఉదయం మా ఆవిడ బ్రేక్ ఫాస్ట్ session లో పరధ్యానంగా ఉంది. ఏంటి సంగతి అంటే, ఈ రోజు నిర్బయ కేసు లో తీర్పు, ఉరి శిక్ష పడుతుందో లేదో ? షిండే ఏదో statement ఇచ్చాడు. ఆ statement, దానికి media response  చూసాక ఉరి శిక్ష పడక పోవచ్చేమో అనిపిస్తుంది అంది. Mostly  ఉరి శిక్ష వేస్తారులే, అంటూ ఆఫీసు కి వెళ్ళాను. ఆఫీసు లో కూడా ఈ కేసు తాలూకు thread బుర్రలో నడుస్తూనే ఉంది

Friday కదా, షాజు అని నా colleague, నేను లంచ్ కి బయటకు వెళ్ళాం.షాజు, కేరళ లో పుట్టిపెరిగాడు. 1-2 వీక్స్ లో father  కాబోతున్నాడు. లంచ్ చేస్తూ,వైఫ్ ఎలా ఉంది, డెలివరీ ఎప్పుడు ఉండవచ్చు, ఇలా మాట్లాడుతూ, అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అని అడిగాను. అబ్బాయి కావాలి, అమ్మాయి అయినా ok అన్నాడు. ఎందుకలా? అని అడగబోయి తమాయించుకున్నాను. గమనించిన షాజు one minute తర్వాత "మా family లో నేనొక్కడినే అబ్బాయిని, ముగ్గురు అక్కలు ఉన్నారు. అక్కలు అందరికి అమ్మాయిలే. అందుకే మా family అంతా అబ్బాయి కోసం waiting" అన్నాడు. Genuine reason ఉందిలే అనుకున్నాను.

"అదీ కాక అబ్బాయి అయితే పెద్ద worry ఏమీ లేదు. అమ్మాయి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు protection కల్పించడం ఒక సమస్య. ఈ మద్య మరీ 4-5 years babies మీద కూడా incidents జరుగుతున్నాయి. అంటే చిన్నప్పటినుంచి వాళ్ళ protection లో extra care కావాలి" అన్నాడు షాజు .  అతను చెప్తున్నది నిజమే కదా!!!

high voltage లో active గా ఉండే నేను, అక్కడ నుంచి office కి వచ్చే వరకు ఎక్కడో ఆలోచిస్తున్నాను.

నేను తండ్రిని కాబోయే సమయంలో నా friend ప్రశ్నకు సమాధానంగా "నాకు అమ్మాయి కావాలి" అంటే, "ఏంటి స్కానింగ్ తీయించి అబ్బాయి అయితే abortion చేయిస్తారా?" అన్నాడు  comedy గా!!! "లేదురా అమ్మాయి కావాలి, అమ్మాయి కోసం అవసరం అయితే second baby  plan చేస్తాం" అని చెప్పాను. అమ్మాయి కావాలి అనుకోవడంలో పెద్ద సామాజిక  కారణాలు ఏమీ లేవు. అది కేవలం మా వ్యక్తిగత ప్రాధాన్యత మాత్రమే .

నేను నా భార్య కోరుకున్నట్టే పాప పుట్టింది. ఆ సమయం లో కొంత మంది నా పట్ల చూపించిన ఉచిత సానుభూతి, "వాళ్ళ లెక్కలు fail అయ్యాయని", "అబ్బాయి అనుకున్నాం" అని, "అయ్యో అమ్మాయి పుట్టిందా?" ఇలా.. పల్లెటూరు లో ఇవన్నీ సహజం కదా అని వదిలేసా. అంత కన్నా చేయ గలిగింది కూడా ఏముంది వాళ్ళని హర్ట్ చేయడం తప్ప !!!

"మన విషయంలో మనకి లేని బాధ ఎదుటి వాళ్ళకి ఉండటం, అది మనకి నచ్చక పోవడం, కానీ ఏమీ అనలేకపోవడం. కరెక్ట్ గా  చెప్పాలి అంటే మన సంతోషంలో ఎదుటి వాళ్ళకి బాధ కనిపించడం, ఆ బాధ మనతోనే పంచుకుంటూ సానుభూతి చూపించడం, మనం వాళ్ళ వయసుని గౌరవించో, మనసు పాడు చేస్కోవడం ఇష్టం లేకో మౌనం వహించాల్సి రావడం" మంచితనానికి, చేతగాని తనానికి మద్యలో ఉన్న సరిహద్దు చెరిగిపోతుందా ? అనే సందేహం వస్తుంది.

కొన్ని రోజుల క్రితం మరొక ఫ్రెండ్ ఫోన్ చేసి, second time father అయిన న్యూస్ చెప్తూ, అబ్బాయి కోసం third baby plan చేయమని ఒత్తిడి ఉందని, అయినప్పటికీ caesarean తో పాటే tubectomy చేయమని డాక్టర్ కి చెప్పేసాను అన్నప్పుడు తనని అభినందించాను.

Evening ఇంటికి వచ్చేటప్పటికి మా ఆవిడ కాస్త ప్రశాంతంగా ఉంది. కాఫీ తాగుతూ తీర్పు ఏమయింది అంటే, ఉరి శిక్ష వేసారు కానీ, Defense Lawyer high  court కి appeal చేస్తా అన్నాడు. చెప్పలేం ఇది అమలు అయ్యేటప్పటికి ఇంకో 10 years పడుతుందేమో అని నిట్టూర్చింది.

"తప్పు చేసిన వాళ్ళు బడా బాబులు ఏమీ కాదు,  వాళ్ళ తరుపున ఒక లాయర్ వాదించడమే ఆశ్చర్యం. వృతి ధర్మం అని చెప్పినప్పటికీ, తప్పు చేసిన వాళ్ళ వైపు వాదించే లాయర్ అంటేనే నాకు చాలా తక్కువ భావన ఉంటుంది.  high  court ఖర్చులు ఎవరు భరిస్తారు. నాకు తెల్సి వీళ్ళు భారీ ఫీజు చెల్లించే category కూడా  కాదు. ఎందుకు లాయర్ కి ఇంత interest" అనుకుంటూ www.tlivetv.com లో TV9 on చేశాను.
ఈ తీర్పు గురించి bulletin నడుస్తుంది.  కొంత సేపటికి Defense Lawyer A.P.Singh వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. అతన్ని చూడగానే దొరక్క దొరక్క ఈ కేసు దొరికినట్టు, free publicity కోసం కష్టపడుతున్నట్టు అనిపించింది.

Excerpt of A.P.Singh's statement
Speaking to reporters outside the Saket court, defence lawyer A P Singh said that the death sentence was 'politically motivated' and he would appeal to the higher court.
"If the country wanted this case to be a deterrent, I will wait for two months to see the crime scene. If no rape takes place due to death being given in the instant case, I will give in writing that my clients be hanged," he said.

A.P. Singh గారి statement ని ఎటు నుంచి చూసినా తర్కం కనిపించలేదు.
AP Singh నోటి దూల ku bar council తొందరలో ఏదో ఒక action తీసుకుంటుంది అని ఆశిస్తున్నాను.
Refer below link about  controversy statement by A P Singh:
http://zeenews.india.com/news/nation/gangrape-controversy-will-burn-my-daughter-alive-if-she-had-premarital-sex-says-defence-lawyer_876512.html

ఈ శిక్ష తొందరగా అమలు అవ్వాలని, సగటు మనిషిగా కోరుకుంటున్నాను

రాధాకృష్ణ