మొదటి బాగం లో రాసినట్లు అలా మొదటి మూడు రోజులు సాగాయి.
ఎట్టకేలకు మా అపార్ట్మెంట్ లో కి వచ్చి, భోజనం చేసాం కదా...
ఎట్టకేలకు మా అపార్ట్మెంట్ లో కి వచ్చి, భోజనం చేసాం కదా...
మేము మంచి చలి కాలంలో వచ్చాం, హీటర్ ఆన్ చేస్తే పని చేయడం లేదు. అడ్మిన్ స్టాఫ్ వీకెండ్ లో పని చేయరు కాబట్టి, సోమవారం వరకు మా మొర వినే నాధుడే లేడు. ఒకేసారి 35 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత కి వచ్చేసరికి మా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదు. .మేము ఇండియా నుంచి ఒక పెద్ద రగ్గు తెచుకున్నాం. బెంగళూరు వాతావరణంలో మంచి ప్రశంసలు పొందిన ఈ రగ్గు, మెల్బోర్న్ వాతావరణానికి నా వల్ల కాదు అని చేతులెత్తేసింది. స్వెట్టర్, సాక్స్ వేసుకున్న ఉపయోగం లేదు. ఆ రాత్రి జాగారం.
ఉదయాన్నే షాప్ కి వెళ్లి ఒక మంచి క్విల్ట్ (తెలుగులో బొంత అంటారేమో కదా!) తీసుకున్నాం. క్విల్ట్ వల్ల కొంత పరిస్థితి మెరుగు ఐనప్పటికీ మాకు కష్టం గానే ఉంది. రాత్రి అవుతుంది అంటే నరకం. సరే ఇంకెంత, రేప్పొద్దున్నే, మన ఆస్థాన సిబ్బంది విచ్చేస్తారు కదా అని కోటి ఆశలతో ఎదురు చుస్తూ ఆదివారం రాత్రి కూడా జాగారం చేశాము.
సోమవారం పొద్దున్నే, సిబ్బందిని కలిసి, ఒప్పందపు పత్రం తాలూకు ఫార్మాలిటీస్ పూర్తి చేసి, హీటర్ సమస్యని వివరించాను. వాళ్ళు తాపీగా ఇదిగో, ఈ బుక్ లో మీ సమస్య వివరాలు రాయండి మీ వంతు వచినప్పుడు టేక్నిషియన్ వచ్చి బాగుచేస్తాడు. వంతు ఏమిటి స్వామి అంటే, మాకు కొన్ని ప్రాదాన్యతలుంటాయి. టేక్నిషియన్ కూడా బిజీ గా ఉంటాడు. వాళ్ల స్లాట్స్ కూడా చూస్కొని చేపిస్తాం. 2 -3 రోజులు పట్టవచ్చు. ప్లీజ్ బేర్ విత్ అజ్ అన్నాడు.
ఈ తంతు పూర్తి చేస్కొని సోమవారం ఆఫీసు కి వెళ్ళాను. సరయిన నిద్ర లేకపోవడం వల్ల, సీట్ లో కూర్చుంటే నిద్రోచేస్తుంది. అసలే కొత్త వర్క్ ప్లేస్. మన పోస్ట్ ఏమో బోడి కన్సల్టెంట్. మా వాడికి బిల్లింగ్ ముఖ్యం. మా క్లైంట్ కి నా పని ముఖ్యం. నేను అసలే చాలా సిన్సియర్. నన్ను నేను ఇలా నిద్ర మొహం తో చూస్కో లేక, మా కంపెనీ వాడికి ఫోన్ చేసి నా పరిస్థితిని వివరించి, నేను ఇక్కడ ఉండలేను, వేరే ఇల్లు చూడు. లేకపోతే ఇండియా వచ్చేస్తాను అని చెప్పాను. వాడు మాత్రం 'మేము ఈ అపార్ట్మెంట్ కి మూడు నెలలు ఒప్పందం రాశాం, ఇప్పుడు ఏమి చేయలేము' అని కరుడు గట్టిన తీవ్రవాది మాదిరిగా చెప్పాడు. నా ఈగో ని తృప్తి పరుచుకోవడానికి 'ప్రతి కుక్క కి ఒక రోజు వస్తుంది' అని చెప్పుకొని, ఆ తీవ్రవాదిని క్షమించి, కిం కర్తవ్యం అని, పరిస్థితులకు అలవాటు పడటానికి ట్రై చేస్తూ, దేవుడా.. ఏవిటయ్యా ఈ పరీక్షలు. ఇండియా లో పెడితే పర్లేదు. పరాయి దేశంలో మాకు ఈ టెస్ట్ లు వద్దు స్వామి అనుకుంటూ పునరావాసం కోసం చూస్తున్న, వరద బాదితుల లాగా హీటర్ కోసం ఎదురు చేస్తున్నాం. ఎట్టకేలకు శుక్రవారం నాటికి ఈ హీటర్ సమస్య పరిష్కారం అయింది.
హీటర్ సంతోషం ఆట్టే నిలవలేదు. 4 -5 డేస్ లో మరొక సమస్య.
నా కన్ను ఎర్రగా అయ్యి కంటి నుండి నీరు కారటం... కలకలు అంటాం కదా... అటువంటిదే. పొద్దున్న లేస్తే పడుకునే దాక కూర్చునేది కంప్యూటర్ ముందే. సెలవు కుదరదు. చలి గాలికి ఈ కంటి బాధ వర్ణనాతీతం . మన దేశం లో మందుల షాపులు ఎలాగో ఇక్కడ ఫార్మసీలు ఉంటాయి. అక్కడికెళ్ళి మన బాధ చెప్తే మందు ఇస్తారు అని వెళ్ళాను. జస్ట్ అబౌట్ టు క్లోజ్. అమ్మా తల్లి అని, నా బాధ అని చెప్పబోతుంటే, సారీ, వుయ్ ఆర్ క్లోజేడ్ అంది. సూపర్ మార్కెట్ కి వెళ్లి గూగుల్ అమ్మ సాయంతో మరియు నాకున్న మిడి మిడి జ్ఞానం తో అక్కడ ఒక ఐ డ్రాప్స్ తీస్కోని వాడాను. వేస్కున్న వెంటనే చాలా రిలీఫ్ గా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత మళ్ళీ మాములే. తగ్గుతుంది అనే ఆశతో 2 డేస్ చూశాను.ఫలితం లేదు. ఫార్మసిస్ట్ దగ్గరకి వెళ్లి, నా బాధ చెప్పుకుంటే, ఆవిడ ఒక మందు ఇచ్చి 3 డేస్ లో తగ్గాలి, తేకపోతే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి అంది. సరే అని 3 డేస్ చూశాను. అదేంటో, నా కన్ను అంతగా నచ్చిందేమో, నేను పోను అని మొండికేసి కూర్చుంది. మన దేశం లో అయితే ఒక వేప కాయ ట్యూబ్ వేస్తే, 2 డేస్ లో టాటా చెప్పాల్సిందే.
డాక్టర్ దేవుడు ఎక్కడున్నాడు అని గూగుల్ అమ్మని అడిగి, కోటి ఆశలతో అక్కడికి వెళ్తే, వాళ్ళు అప్పాయింట్మెంట్ ఇచ్చారు, మరుసటి రోజు ౩ గంటలకు రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చారు. అదేంటో, డాక్టర్స్ కూడా 9 -5 పని చేస్తారు. కన్ను పోయేలా ఉంది అంటే, మరుసటి రోజు రమ్మంటారు :(
వాళ్ళు చెప్పిన టైం కి వెళ్లి, చాలా ఆత్రుత తో చూస్తున్నాను. ఇక్కడ మన దేశం లో లాగా ఒక డాక్టర్ కి ఇద్దరు ముగ్గురు నర్సులు లేరు. ఆయనే బయటకి వచ్చి నన్ను లోపలి తీస్కెళ్ళాడు. ఆయనకి నా బాధను చాలా వివరంగా చెప్పి, వల వల ఏడ్చినంత పని చేశాను. ఆయన అన్ని కోణాల్లో, కేసు ని దర్యాప్తు చేసి, నాకేమన్న చూపు మందగించినదా అని కూడా వెరిఫై చేస్కొని డ్రాప్స్ ఇచ్చి 5 డేస్ వాడు, తగ్గకపోతే స్పెషలిస్ట్ దగ్గరికి వెల్దువు అన్నాడు. డ్రాప్స్ వైపు, తన వైపు నేను చూసిన చూపు ని డాక్టర్ బాగా క్యాచ్ చేసాడు. అయ్యా, anti-biotic tablets ఇవ్వండి. కాస్త 1 -2 రోజుల్లో తగ్గే మార్గం ఎమన్నా చూపండి. నేను ఆల్రెడీ ఈ కలకలతో వారోత్సవాలు జరిపేసాను. మాసోత్సవాలను జరుపుకొనే ఓపిక లేదు. దీన్ని ఇంకో 2 -3 వారాలు సాగ పీక కుండా, 1 -2 రోజుల్లో తగ్గే మార్గం సెలవివ్వండి స్వామి అంటే... ఆయనొక నవ్వు నవ్వి anti-biotic వల్ల నష్టాల మీద నాకు క్లాసు తెస్కొని పంపించేసాడు. నాలుగు రోజుల్లో తగ్గడంతో హమ్మయ్య అని ఉపిరి పీల్చుకున్నాను.
మనమేమో ఇండియా లో పిల్లోడికి జలుబు చేసినా, anti-biotic ని విరివిగా వాడేసి రెండు రోజుల్లో తగ్గించేసి, వాడి బాడీ మీద మామూలు మందులు పనిచేయకుండా చేసేస్తాం. ఆ ప్రభావంతో వీళ్ళు ఇచ్చిన మందులు మన మీద అంతా తేలిగ్గా పని చేయలేదు అనిపించింది నాకు. లేకపోతే కళ్ళ కలకకు పది రోజుల పైన అవస్థ పడటం ఏంటి, ఇలా బ్లాగ్ లో బాధలు రాయడం ఏంటి..
మొత్తం మీద మొదటి మూడు వారాలూ, అష్ట కష్టాలు పడినా, తర్వాత అంతా సవ్యం గానే ఉంది. సమ్మర్ కూడా వచ్చేయడంతో ఒకే రోజు ఎండాకాలం వానాకాలం చలికాలాలను చూస్తున్నాం. మూడు నెలల ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్కొని ఇంకో నాలుగు రోజుల్లో మన దేశానికి వచ్చేస్తున్నాం.
chala bagundi post
ReplyDelete